Telugu Gateway
Cinema

బాలకృష్ణ కు జోడి గా కాజల్

బాలకృష్ణ కు జోడి గా కాజల్
X

అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎన్ బీకె 108 సినిమాకు సంబంధించి కొత్త అప్డేట్ వచ్చింది. ఈ సినిమాలో బాల కృష్ణ కు జోడిగా కాజల్ అగర్వాల్ నటించనుంది. ఈ మేరకు సోమవారం నాడు అధికారికంగా వెల్లడించారు. కొద్ది రోజుల క్రితమే ఈ సినిమాలో శ్రీ లీల సందడి చేయనుంది అని ప్రకటించారు. అదే తరహాలో ఈ లుక్ కూడా విడుదల చేశారు. హీరో బాలకృష్ణ చెయ్యి...కాజల్ చెయ్యి డీ కొట్టినట్లు లుక్ విడుదల చేశారు. షైన్ స్క్రీన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. బాలకృష్ణ వరసగా అఖండ, వీరసింహ రెడ్డి సినిమాలతో మంచి హిట్స్ దక్కించుకున్నారు. అనిల్ రావిపూడి , బాలకృష్ణ కాంబినేషన్ తొలిసారి. ఇటీవల వరకు రాయలసీమ ప్రాంత కథలు చేసిన బాలకృష్ణ ఈ సినిమా ద్వారా తెలంగాణ కథ చేస్తున్నారు అని అనిల్ రావిపూడి కొద్ది రోజుల క్రితం ప్రకటించిన విషయం తెలిసిందే.

Next Story
Share it