శశిరేఖ వచ్చేసింది

చిరంజీవి, అనిల్ రావిపూడి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమాపై ఫుల్ బజ్ ఉంది. ఎందుకంటే ఈ సంక్రాంతికి వెంకటేష్ తో కలిసి సంక్రాంతి వస్తున్నాం సినిమాతో అనిల్ రావిపూడి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి, నయనతార జంటగా నటిస్తున్న మన శివ శంకర వరప్రసాద్ గారు సినిమా కూడా సెంటిమెంట్ తప్పకుండా వచ్చే సంక్రాంతికే విడుదల చేస్తున్నారు. ఈ సినిమా నుంచి బుధవారం నాడు చిత్ర యూనిట్ ఒక అప్ డేట్ ఇచ్చింది. ఇందులో నయనతార శశిరేఖ పాత్రలో కనిపించబోతున్నట్లు చెపుతూ ఆమె న్యూ లుక్ ను విడుదల చేసింది.
నయనతారతో కలిసి పనిచేయటం ఎంతో ఆనందంగా ఉంది అని చెపుతూ దర్శకుడు అనిల్ రావిపూడి సోషల్ మీడియా లో ఆమె న్యూ లుక్ ను షేర్ చేశారు. తన పాత్రతో ఈ సినిమాకు ఆమె మరింత అందం తెచ్చారు అన్నారు. దసరా పండగకు ఈ సినిమా నుంచో మరో సర్ప్రైజ్ కూడా ఇవ్వనున్నట్లు తెలిపారు. ఇప్పటికే పలు షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పాటలు ఇప్పుడు ఒక ప్రత్యేక సెట్ లో సాగుతున్నట్లు చెపుతున్నారు. ఈ మూవీలో వెంకటేష్ కూడా ఒక ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు. 2026 సంక్రాంతి బరిలో చిరంజీవి సినిమాతో పాటు ప్రభాస్ రాజాసాబ్, నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన అనగనగ ఒక రాజు మూవీ లు రానున్నాయి.



