ఇక కామెడీ ఆడిపోవటమే

దర్శకుడు అనిల్ రావిపూడి ఇప్పుడు ఏ ప్రాజెక్ట్ చేపట్టినా దానిపై ప్రతి ఒక్కరిలో అటెన్షన్ పెరుగుతోంది. దీనికి ప్రధాన కారణం బాక్స్ ఆఫీస్ వద్ద ఆయన ప్రాజెక్ట్ లు అన్నీ కమర్షియల్ గా మంచి హిట్స్ సాదిస్తుండటమే. ఈ సంక్రాంతికి వచ్చిన అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన వెంకటేష్ సినిమా సంక్రాంతి వస్తున్నాం బాక్స్ ఆఫీస్ దగ్గర ఏకంగా 300 కోట్ల రూపాయలకు పైగా వసూళ్లు సాధించి సెన్సషనల్ విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే.
ఇప్పుడు అనిల్ రావిపూడి మెగా స్టార్ చిరంజీవితో కలిసి ఒక సినిమా చేస్తున్నారు. శనివారం నాడు ఈ సినిమాలో హీరోయిన్ గా నయనతార ను ఎంపిక చేసినట్లు అధికారికంగా ప్రకటించారు. నయనతార గతంలో కూడా చిరంజీవి తో కలిసి సైరా నరసింహారెడ్డి, గాడ్ ఫాదర్ సినిమాల్లో నటించిన సంగతి తెలిసింది. ఇప్పుడు మరో సినిమాకు ఓకే చేయటంతో వీళ్లిద్దరి కాంబినేషన్ లో ఇది హ్యాట్రిక్ సినిమా కానుంది. చిరు 157 సినిమాలోకి నయనతారకు స్వాగతం పలుకుతూ ఒక వీడియో విడుదల చేశారు. ఇది కూడా అనిల్ రావిపూడి మార్క్ స్టైల్ లోనే ఉంది.