Telugu Gateway
Cinema

న‌వీన్ పోలిశెట్టి కొత్త సినిమా 'అన‌గ‌న‌గ‌ ఓ రాజు'

న‌వీన్ పోలిశెట్టి కొత్త సినిమా అన‌గ‌న‌గ‌ ఓ రాజు
X

న‌వీన్ పోలిశెట్టి మ‌రో స‌ర‌దా సినిమా రెడీ అవుతోంది. అదే 'అన‌గ‌న‌గ‌ ఓ రాజు' . ఈ కొత్త సినిమాకు సంబంధించిన టైటిల్ తోపాటు టైటిల్ టీజ‌ర్ ను కూడా విడుద‌ల చేసింది చిత్ర యూనిట్. 'ఇదేమి విడ్డూరం. ఆడ‌వాళ్ల‌కేనా వ‌డ్డాణం. అందుకే నేను కూడా మామ‌కు చెప్పి..డ‌బ్ల్యూడ‌బ్ల్యూడ‌బ్ల్యూ బెల్ట్ లాంటి ఓ ఐదు కిలోల బంగారంతో వ‌డ్డాణం చేయించ‌మంటా' వంటి ఫ‌న్నీ డైలాగ్ ల‌తో ఆక‌ట్టుకుంటాడు న‌వీన్.

పెళ్లికొడుకు అవ‌తారంలో క‌న్పించిన న‌వీన్..సోష‌ల్ మీడియాలో మ‌న ఫోటోలు చూసి క‌త్రినా కైఫ్‌, విక్కీ కౌశ‌ల్ లు కుళ్లుకుని చావాలి అంటూ ఫోటోగ్రాఫ‌ర్ ను అడుగుతాడు. మామ‌ ఎంత ఖ‌ర్చు పెట్టాడు ఫోటోలోనే మొత్తం క‌న‌ప‌డాలి అంటూ కామెడీ చేస్తాడు. క‌ళ్యాణ్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాను సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ నిర్మిస్తోంది. త‌మ‌న్ మ్యూజిక్ అందిస్తున్నారు. నేను చెప్ప‌కూడ‌దు కానీ ఈ ద‌శాబ్దంలోనే అల‌రించే కార్య‌క్ర‌మం ఇదే అంటూ హంగామా చేస్తాడు. ఈ స‌ర‌దా వీడియో మీరూ ఓ సారి చూసేయ్యండి.

Next Story
Share it