జెర్సీ..మహర్షిలకు జాతీయ అవార్డులు
హీరో నాని నటించిన 'జెర్సీ' సినిమా బాక్సాఫీస్ వద్ద సంచలన విజయం నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ సినిమాలో నాని నటనకు ప్రేక్షకుల నుంచి ప్రశంసలు దక్కాయి. ఈ సినిమాకు ఇప్పుడు ఉత్తమ తెలుగు చిత్రంగా జాతీయ అవార్డు దక్కించుకుంది. కేంద్రం సోమవారం నాడు 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రకటించింది. ఇందులో పలు తెలుగు సినిమాలు అవార్డులను కైవసం చేసుకున్నాయి. మహేష్ బాబు హీరోగా నటించిన మహర్షి సినిమాకు జాతీయ స్థాయిలో ఉత్తమ వినోదాత్మక చిత్రంగా అవార్డు దక్కింది. రాజు సుందరం మహర్షి చిత్రానికి ఉత్తమ కొరియోగ్రాఫర్ అవార్డు ను పొందారు. జెర్సీ సినిమా ఉత్తమ జాతీయ చిత్రంగా నిలవటంతోపాటు ఇదే సినిమాకు గాను ఉత్తమ ఎడిటర్‌గా నవీన్ నూలికి జాతీయ అవార్డు అందుకోనున్నారు. దివంగత సుశాంత్ సింగ్ రాజ్పుత్ హీరోగా నటించిన చిచోరే కు ఉత్తమ హిందీ చిత్రం అవార్డు వచ్చింది.
బాలీవుడ్ నటుడు మనోజ్ బాజ్‌పాయ్, తమిళ నటుడు ధనుష్‌లకు జాతీయ ఉత్తమ నటుడు అవార్డులు గెలుచుకున్నారు. భోస్లే సినిమాకు గానూ మనోజ్ బాజ్‌పాయ్, అసురన్' చిత్రానికి గానూ ధనుష్‌కు ఉత్తమ నటుడి అవార్డు దక్కాయి. మణికర్ణిక, పంగా చిత్రాలకు గానూ కంగానా రనౌత్ కు ఉత్తమనటి అవార్డు. ఉత్తమ సహాయ నటిగా పల్లవి జోషి, ఉత్తమ సహాయ నటుడిగా విజయ్ సేతుపతికి అవార్డులు దక్కాయి. జల్లికట్టు సినిమాకు గిరీశ్ గంగాధరన్‌కు సినిమాటోగ్రఫీ అవార్డు రాగా, ఫిలిం ఫ్రెండ్లీ రాష్ట్రంగా సిక్కింకు పురస్కారం అందుకుంది.