Telugu Gateway
Cinema

పెళ్లి ప్రకటన చేసిన నరేష్, పవిత్ర

పెళ్లి ప్రకటన చేసిన నరేష్, పవిత్ర
X

టాలీవుడ్ కు చెందిన సీనియర్ నటుడు నరేష్ ఈ మధ్య కాలంలో తరచూ వార్తల్లో నిలుస్తున్నారు.దీనికి ప్రధాన కారణం అయన తన సహ నటి పవిత్ర లోకేష్ తో సాగిస్తున్న సహజీవనం. ఒక సారి వీరిద్దరూ బెంగళూరు లో ఉండగా నరేష్ భార్య వీళ్లపై దాడి చేసే ప్రయత్నం చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ విషయం పెద్ద చర్చనీయాంశగా మారింది. నరేష్ తన కుటుంబ కార్యక్రమాల్లో అధికారికంగానే పవిత్ర లోకేష్ ను వెంట పెట్టుకు వెళుతున్న విషయం తెలిసిందే. కొత్త ఏడాది లోకి ప్రవేశిస్తున్న తరుణంలో నరేష్ ట్విట్టర్ వేదికగా ఒక ప్రకటన చేశారు.

త్వరలోనే తాము వివాహబంధంతో ఒక్కటి కాబోతున్నామని తెలిపారు . అంతేకాదు.. ఈ మూమెంట్‌ని వారు సెలబ్రేట్ చేసుకుంటున్నట్లుగా చూపిస్తూ.. ఇద్దరూ లిప్‌లాక్ చేసుకుంటున్న వీడియోని నరేష్ ట్వీట్‌ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. పవిత్ర నెరేడ్ అనే హాష్ టాగ్ ను వీడియోకి జత చేశారు. నరేష్, పవిత్ర లు కలిసి పలు సినిమాల్లో నటించారు. ఇప్పుడు తమ బంధాన్ని అధికారికం చేయబోతున్నారు.

Next Story
Share it