Telugu Gateway
Cinema

నార‌ప్ప పాట విడుద‌ల‌

నార‌ప్ప పాట విడుద‌ల‌
X

వెంక‌టేష్ హీరోగా న‌టించిన నార‌ప్ప సినిమా ఈ నెల 20న అమెజాన్ ప్రైమ్ లో విడుద‌ల కానుంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ విడుద‌ల చేసిన చిత్ర యూనిట్ శ‌నివారం నాడు 'ఓ నార‌ప్ప నువ్వంటే ఎంతో ఇట్టంగుంది నారప్ప..నిను సూడంగానే విప్పారిందోయ్ నారెప్ప' అంటూ సాగే ఓ పాటను విడుద‌ల చేశారు. కూల్ గా...అత్యంత స‌హ‌జంగా ఈ పాట‌ను చిత్రీక‌రించారు.

ఈ పాటకు అనంత శ్రీరామ్‌ లిరిక్స్‌ అందించగా, మణిశర్మ సంగీతం అందించారు. ఈ చిత్రంలో వెంకటేశ్‌ సరసన ప్రియమణి నటించారు. ప్రకాశ్‌రాజ్, మురళీశర్మ, కార్తిక్‌ రత్నం కీలకపాత్రలు పోషించారు. ఈ సినిమాలో వెంక‌టేష్ ద్విపాత్రిభిన‌యం చేస్తున్నారు.

Next Story
Share it