నారప్ప ట్రైలర్ వచ్చేసింది

థియేటర్లు తెరిచే తేదీపై ఇప్పటికీ క్లారిటీ లేదు. రెండు తెలుగు రాష్ట్రాల్లో థియేటర్ల ఓపెన్ కు సర్కార్లు ఆమోదం తెలిపినా ఇంకా తేలాల్సిన లెక్కలు చాలానే ఉన్నాయి. దీంతో థియేటర్ల లో సినిమాలపై అనిశ్చితి రాజ్యమేలుతోంది. దీంతో నారప్ప చిత్ర యూనిట్ తాజాగా ఓటీటీకే మొగ్గుచూపుతున్నట్లు ప్రకటించి..జులై20న సినిమాను అమెజాన్ ప్రైమ్ లో విడుదల చేయనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో బుధవారం నాడు సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేసి..సినిమా ప్రమోషన్ వేగం పెంచారు.
విక్టరీ వెంకటేశ్ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'నారప్ప'. తమిళ మూవీ 'అసురన్'కి తెలుగు రీమేక్ . శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేశ్ బాబు, కలైపులి ఎస్. థాను సంయుక్తంగా నిర్మించారు. ప్రియమణి ఇందులో హీరోయిన్‌గా నటిస్తోంది. ట్రైలర్ చూస్తే 'నారప్ప'గా వెంకటేశ్ అదరగొట్టేశాడు. 'వాళ్లను ఎదిరించడానికి అది ఒక్కటే దారి కాదు. మన దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు. డబ్బు ఉంటే లాగేసుకుంటారు. కానీ చదువును ఒక్కటి మాత్రం మన దగ్గర నుంచి ఎవ్వరూ తీసుకోలేరు చిన్నప్ప' అంటూ వెంకటేశ్ చెప్పే డైలాగ్ తో ట్రైలర్ ఆకట్టుకుంటోంది.