మోహన్ బాబు ఫస్ట్ లుక్

ది పారడైజ్ సినిమా లో హీరో నాని లుక్కే ఎంతో వెరైటీ గా ఉంది. గుబురు గడ్డం..మీసాలకు తోడు జడలు కూడా ఉన్నాయి. ఇందులో నాని పాత్ర పేరు కూడా జడలే. ఇదే వెరైటీ గా ఉంది అనుకుంటే శనివారం నాడు చిత్ర యూనిట్ మోహన్ బాబు న్యూ లుక్ ను విడుదల చేసింది. టాలీవుడ్ లో హీరో నాని వరస హిట్స్ తో దూసుకెళుతున్న విషయం తెలిసిందే. గత కొంత కాలంగా ఆయన మాస్ ఇమేజ్ పై ఫోకస్ పెట్టి విజయాలు సాధిస్తున్నాడు కూడా. ఇదే జానర్ లో వచ్చిన దసరా...సరిపోదా శనివారం సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి ఫలితాలు దక్కించుకున్నాయి. ఇప్పుడు వీటిని తలదన్నేలా ది పారడైజ్ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. దసరా సినిమా దర్శకుడు శ్రీకాంత్ ఓదెలనే ఈ మూవీ ని కూడా తెరకెక్కిస్తున్నాడు. చిత్ర యూనిట్ శనివారం నాడు ఈ సినిమా కు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చింది. ది పారడైజ్ మూవీ లో మోహన్ బాబు ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు.
ఇందులో మోహన్ బాబు చొక్కా లేకుండా... రక్తం అంటిన చేతులతో ఒక వైపు కత్తి..మరో వైపు గన్ పెట్టుకుని కనిపిస్తాడు. ఇందులో సికంజ మాలిక్ పాత్రలో మోహన్ బాబు కనిపించబోతున్నారు. ఈ లుక్ చూస్తే పారడైజ్ మూవీ లో ఈ సీనియర్ హీరో పవర్ ఫుల్ విలన్ రోల్ లో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే బయటకు వచ్చిన నాని లుక్స్ కూడా ఎంతో డిఫరెంట్ గా ఉన్న విషయం తెలిసిందే. ది పారడైజ్ మూవీ వచ్చే ఏడాది మార్చి 26 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీ ఏకంగా ఎనిమిది భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకు సుధాకర్ చెరుకూరి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.



