నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

భారీ అంచనాల మధ్య విడుదల అయిన ప్యారడైజ్ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర అంతగా ప్రభావం చూపించలేకపోయింది. నాని హీరోగా నటించిన ఈ సినిమా సెప్టెంబర్ 24 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 173 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ మూవీ పై తొలుత భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి ప్రధాన కారణం సినిమాలోని పాటలు...శ్రీకాంత్, నాని కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ కూడా. అయితే సినిమా విడుదల తర్వాత మాత్రం ప్యారడైజ్ మూవీ విషయంలో మిశ్రమ స్పందనలే వ్యక్తం అయ్యాయి. ముఖ్యంగా ఈ సినిమాలో హింసాత్మక సన్నివేశాలను దర్శకుడు ఒక కొత్త హై కి తీసుకెళ్లాడు అనే విమర్శలు ఎదుర్కొన్నాడు.



