Telugu Gateway
Cinema

నాని కెరీర్ లోనే కొత్త రికార్డు నమోదు అవుతుందా?!

నాని కెరీర్ లోనే కొత్త రికార్డు నమోదు అవుతుందా?!
X

విడుదలకు ముందే నాని ప్యారడైజ్ మూవీ దుమ్మురేపుతోంది. బుధవారం నాటి ప్రీమియర్ షోస్ తో పాటు గురువారం నాడు రెగ్యులర్ షోస్ కు ప్రేక్షకుల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే సినిమాపై అంచనాలు ఏ రేంజ్ లో ఉన్నాయో అర్ధం అవుతోంది. మరో వైపు ఉత్తర అమెరికా లో కూడా నాని ప్యారడైజ్ మూవీ ప్రీ సేల్స్ లోనే మిలియన్ డాలర్స్ మార్క్ ను అధిగమించి దూసుకెళుతోంది. ప్రీమియర్స్ కి కొన్ని గంటల ముందే ఈ మూవీ 1 మిలియన్ డాలర్స్ మార్క్ దాటేయడం ఒకెత్తు అయితే ఇది క్రాస్ అయిన కొంతసేపటికే మరో లక్ష డాలర్స్ గ్రాస్ మార్క్ అందుకుంది. ఈ జోష్ చూస్తుంటే ప్యారడైజ్ మూవీ ఫస్ట్ డే వసూళ్లు నాని కెరీర్ లోనే కొత్త రికార్డు నమోదు చేయటం ఖాయంగా కనిపిస్తోంది.

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల తెరకెక్కించిన ఈ మూవీ లో నానికి జోడిగా కయాదు లోహర్ నటించింది. గతంలో ఎన్నడూ లేని రీతిలో నాని ఊరమస్ పాత్రలో జడల్ గా ఇందులో కనిపించనున్నాడు. నాని, శ్రీకాంత్ ఓదెల గతంలో కలిసి చేసిన దసరా మూవీ కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని సాధించింది. ఎస్ ఎల్ వి సినిమాస్ బ్యానర్ పై సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ మూవీకి అనిరుద్ సంగీతం అందించాడు. ఇప్పటికే విడుదల అయిన ఈ సినిమా పాటలు ప్యారడైజ్ పై అంచులను పెంచటంలో సఫలం అయ్యాయి. ఇందులో సీనియర్ నటుడు మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబు లు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Next Story
Share it