Telugu Gateway
Cinema

ప్యారడైజ్ మూవీ పై పెరుగుతున్న అంచనాలు

ప్యారడైజ్ మూవీ పై పెరుగుతున్న అంచనాలు
X

దర్శకుడు శ్రీకాంత్ ఓదెల, నాని కాంబినేషన్ లో వస్తున్న ప్యారడైజ్ మూవీకి పెద్ద ఎత్తున బజ్ ఉంది. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన దసరా మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి ఫలితాన్ని రాబట్టిన సంగతి తెలిసిందే. ఉత్తర అమెరికా లో ప్యారడైజ్ మూవీ సేల్స్ మొదలు పెట్టారో లేదో వెంటనే ఈ సినిమా లక్ష డాలర్ల వసూళ్లు రాబట్టింది. అత్యంత వేగంగా ఉత్తర అమెరికా లో ప్రీ సేల్స్ లో ఈ ఫీట్ సాధించినట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ఒక లుక్ రిలీజ్ చేసింది. సెప్టెంబర్ 24 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ సినిమాలో హీరో నాని ఊరమాస్ జడల్ లుక్ లో హంగామా చేయనున్నాడు. ఇందులో నానికి జోడిగా కయాదు లోహర్ నటించింది.

ప్రీ సేల్స్ లో ఇప్పటికే నాని సినిమా రికార్డు క్రియేట్ చేయగా సినిమా విడుదల అయ్యే నాటికీ ఈ వసూళ్లు ఎక్కడకు చేరతాయో అన్న ఆసక్తి టాలీవుడ్ వర్గాల్లో ఉంది. ఒక్క సినీ మార్క్ బుకింగ్ ఫ్లాట్ ఫార్మ్ ద్వారానే అత్యంత వేగంగా లక్ష డాలర్ల వసూళ్ల రికార్డు నమోదు అయింది. ప్యారడైజ్ మూవీ పాటలు ఇప్పటికే సూపర్ హిట్ అయినా సంగతి తెలిసిందే. ముఖ్యంగా ఇటీవల విడుదల అయిన ఏష నాగుల పాట పది రోజుల్లోనే 76 మిలియన్ల వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ మూవీ లో మోహన్ బాబు, సంపూర్ణేష్ బాబులు ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Next Story
Share it