Telugu Gateway
Cinema

డిసెంబ‌ర్24న శ్యామ్ సింగరాయ్ విడుద‌ల‌

డిసెంబ‌ర్24న శ్యామ్ సింగరాయ్ విడుద‌ల‌
X

హీరో నాని, సాయిప‌ల్ల‌వి న‌టించిన శ్యామ్ సింగ‌రాయ్ విడుద‌ల తేదీ వ‌చ్చేసింది. డిసెంబ‌ర్ 24న ఈ సినిమా విడుద‌ల చేస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్ర‌క‌టించింది. రాహుల్ సాంకృత్యాయన్ దర్శకత్వంలో ఈ సినిమా తెర‌కెక్కింది. ఈ చిత్రంలో సాయి పల్లవితోపాటు కృతిశెట్టి, మడోన్నా సెబాస్టియన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ మేరకు నాని, సాయిపల్లవి కలిసి ఉన్న పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ సినిమా తెలుగు, త‌మిళ్, మ‌ళ‌యాళం, క‌న్న‌డ భాష‌ల్లో విడుద‌ల కానుంది. డిసెంబ‌ర్ లో ప‌లు కీల‌క సినిమాలు విడుద‌ల కానున్నాయి. డిసెంబ‌ర్ 17న అల్లు అర్జున్, ర‌ష్మిక మంద‌న లు న‌టించిన పుష్ప తొలి భాగం విడుద‌ల కానుంది. ఇప్పుడు శ్యామ్ సింగ‌రాయ్ విడుద‌ల తేదీ కూడా వ‌చ్చేసింది.

Next Story
Share it