నాని...వరసగా వంద కోట్ల సినిమాలు

హీరో నాని మళ్ళీ కొట్టేశాడు. హిట్ 3 మూవీ కూడా ప్రపంచ వ్యాప్తంగా వంద కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది. నాలుగు రోజుల్లోనే నాని హిట్ 3 మూవీ 101 కోట్ల రూపాయల గ్రాస్ ను అధిగమించింది. దీంతో చిత్ర టీం ఫుల్ ఖుషీగా సర్కారు సెంచరీ అంటూ నాని న్యూ లుక్ ను విడుదల చేసింది. అమెరికా మార్కెట్ లో కూడా ఈ సినిమా రెండు మిలియన్ల వసూళ్లను క్రాస్ చేసింది. హిట్ 3 సినిమాలో ఒక రేంజ్ లో హింస..రక్తపాతం ఉన్నా కూడా ఈ స్థాయిలో కలెక్షన్స్ రావటం కీలకం అనే చెప్పాలి. దర్శకుడు శైలేష్ కొలను హిట్ ఫ్రాంచైజ్ లో భాగంగా నాని తో హిట్ 3 ని తెరకెక్కించిన సంగతి తెలిసిందే.
ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే ఈ సినిమా కు పాజిటివ్ టాక్ వచ్చింది. గత సినిమాలకు బిన్నంగా నాని అర్జున్ సర్కారు పాత్రలో తనలోని కొత్త కోణాన్ని చూపించాడు. హిట్ 3 కూడా వంద కోట్ల రూపాయల వసూళ్లను సాధించటంతో నాని ఖాతాలో ఇప్పుడు నాలుగు వంద కోట్ల రూపాయలు వసూళ్ల సినిమాలు ఉన్నట్లు అయింది. గతంలో నాని నటించిన సరిపోదా శనివారం, దసరా, ఈగ సినిమా లు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద వంద కోట్ల రూపాయల వసూళ్లు సాధించాయి. ఇప్పుడు ఆ జాబితాలోకి హిట్ 3 కూడా వచ్చి చేరింది.