Telugu Gateway
Cinema

డిఫరెంట్ లుక్ లో నాని

డిఫరెంట్ లుక్ లో నాని
X

ఓ వైపు నాని 'టక్ జగదదీష్ ' సినిమాలో స్టైలిష్ లుక్ లో కన్పిస్తూనే..మరో వైపు 'శ్యామ్ సింగరాయ్' సినిమాలో పాతకాలపు నాటి లుక్ లోనూ ఆకట్టుకున్నాడు. నాని పుట్టిన రోజును పురస్కరించిన చిత్ర యూనిట్ బుధవారం నాడు ఈ లుక్ ను విడుదల చేసింది. నాని పాతకాలపు లుక్ లో ఉండగా.. వెనక నుంచి ఓ యువతి కౌగిలించుకుని ఉంది.

ఆమె చేతులు మాత్రమే కన్పిస్తాయి..తప్ప ఎవరో కన్పించదు. ఈ లుక్ ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమాలో నానికి జోడీగా సాయిపల్లవితోపాటు కృతిశెట్టి కూడా నటిస్తోంది. ఈ సినిమాకు రాహుల్ సంకీర్తన్ దర్శకత్వం వహిస్తుండగా.. సూర్యదేవర నాగ వంశీ నిర్మాతగా ఉన్నారు.

Next Story
Share it