Telugu Gateway
Cinema

నాని 'ద‌స‌రా' ప్రారంభం

నాని ద‌స‌రా ప్రారంభం
X

న్యాచుర‌ల్ స్టార్ నాని కొత్త సినిమా ప్రారంభం అయింది. 'ద‌స‌రా' పేరుతో తెర‌కెక్కిస్తున్న ఈ సినిమాలో నానికి జోడుగా కీర్తి సురేష్ న‌టిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ముహుర్త‌పు షాట్ ను బుధ‌వారం నాడు హైద‌రాబాద్ లో చిత్రీక‌రించారు. దీనికి సంబంధించిన ఫోటోను నాని సోష‌ల్ మీడియాలో షేర్ చేశారు.శ్రీకాంత్ ఒదెల ద‌ర్శ‌క‌త్వంలో ఈ సినిమా తెర‌కెక్క‌నుంది. ద‌స‌రా మూవీ రెగ్యుల‌ర్ షూటింగ్ మార్చిలో ప్రారంభం కానుంది. పక్కా గ్రామీణ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ గా ఈ సినిమా తెర‌కెక్క‌నుంద‌ని చిత్ర యూనిట్ వెల్ల‌డించింది.

Next Story
Share it