Telugu Gateway
Cinema

దసరా ఓటీటీ డేట్ ఫిక్స్

దసరా ఓటీటీ డేట్ ఫిక్స్
X

హీరో నాని చేసిన తొలి పాన్ ఇండియా సినిమా దసరా. ఇది పేరుకు పాన్ ఇండియా సినిమానే అయినా వచ్చిన కలెక్షన్స్ లో ఎక్కువ మొత్తం మాత్రం తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్ నుంచే. ఇతర భాషల్లో మాత్రం పెద్దగా ఆకట్టుకోలేక పోయింది అనే చెప్పాలి. అయితే మొత్తానికి వంద కోట్ల రూపాయలపైనే వసూళ్లు సాధించి రికార్డు నెలకొల్పింది. తెలుగు తో పాటు తమిళ్, కన్నడం, మలయాళం, హిందీ లోనూ విడుదల అయింది. ఈ సినిమా లో హీరో నాని, హీరోయిన్ కీర్తి సురేష్ లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.

శ్రీకాంత్ ఓదెల తన తొలి సినిమాతో వంద కోట్ల రూపాయల వసూళ్ల క్లబ్ లో చేరి సంచలనం సృష్టించారు. ఈ సినిమా ఇక ఇప్పుడు ఏప్రిల్ 27 నుంచి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. ఈ మేరకు అధికారికంగా ప్రకటన చేసింది. దసరా సినిమాపై హైప్ పెంచటంలో ఈ సినిమాలోని పాటలు కీలక పాత్ర పోషించాయనే చెప్పాలి.

Next Story
Share it