Telugu Gateway
Cinema

బి బి 4 ప్రకటన వచ్చేసింది

బి బి 4 ప్రకటన వచ్చేసింది
X

బాలకృష్ణ, బోయపాటి శ్రీను సినిమా అంటే అంచనాలు ఒక రేంజ్ లో ఉంటాయి. ఎందుకంటే వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమా లు బ్లాక్ బస్టర్ విజయాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. అవే సింహ, లెజెండ్, అఖండ. ఇప్పుడు ఇదే కాంబినేషన్ రిపీట్ అవుతోంది. బాలకృష్ణ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం నాడు బీబీ 4 అంటే వీళ్ళ కాంబినేషన్ లో రానున్న నాల్గవ సినిమాపై ప్రకటన వెలువడింది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాణ సంస్థ 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్ నిర్మిస్తోంది. అయితే ఇది అఖండ 2 సినిమానా ..లేక మరొకటా అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

ఈ సినిమాను బాలకృష్ణ కూతురు తేజశ్వని నందమూరి ప్రెజంట్ చేస్తుండటం మరో విశేషంగా చెప్పుకోవాలి. ప్రస్తుతం బాలకృష్ణ బాబీ కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో నటిస్తున్నారు. ఇది బాలకృష్ణ 109 వ సినిమా. ఈ సినిమా గ్లిమ్స్ కూడా విడుదల చేశారు. ఇందులో బాలకృష్ణ ను పవర్ ఫుల్ లుక్ లో చూపించారు. జాలి, దయ, కరుణ లేనటువంటి ఒక అసురుడు అంటూ బాలయ్యపై ఇందులో ఇచ్చిన ఎలివేషన్స్ ఫాన్స్ ను ఆకట్టుకునేలా ఉన్నాయని చెప్పాలి.

Next Story
Share it