Telugu Gateway
Cinema

క్రేజీ కాంబినేషన్ సెట్

క్రేజీ కాంబినేషన్ సెట్
X

టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, దర్శకుడు బోయపాటి శ్రీను కాంబినేషన్ కు ఉన్నంత క్రేజ్ ఎంతో అందరికి తెలిసిందే. వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిన మూడు సినిమాలు కూడా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్మురేపాయి. అవే సింహ, లెజెండ్, అఖండ. ఇప్పుడు దసరా సందర్బంగా బిబి 4 అప్ డేట్ వెలువడింది. మరో సారి బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్ లో సినిమా రాబోతోంది.

అక్టోబర్ 16 న పూజా కార్యక్రమాలతో ఈ సినిమాను ప్రారంభించబోతున్నారు. అదే రోజు ఈ సినిమాలో నటించే ఇతర నటీనటుల వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. ఈ సినిమాకి తమన్ సంగీతం అందించనున్నారు. ప్రముఖ నిర్మాణం సంస్థ 14 రీల్స్ ప్లస్ భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించనుంది. దసరా అప్ డేట్ తో బాలకృష్ణ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు అనే చెప్పాలి.

Next Story
Share it