Telugu Gateway
Cinema

'గుర్ర‌మెక్కిన' బాల‌య్య‌

గుర్ర‌మెక్కిన బాల‌య్య‌
X

సినిమాల్లో నందమూరి బాలకృష్ణ ఫైట్లు..యాక్షన్స్ స్పెష‌ల్ గా ఉంటాయి. తాజాగా విడుద‌లైన అఖండ సినిమాలోనూ ఆయ‌న త‌న సత్తా చాటారు. సినిమాల త‌ర‌హాలోనూ నందమూరి బాలకృష్ణ అప్పుడప్పుడు బ‌య‌ట కూడా హంగామా చేస్తుంటారు. తాజాగా ప్ర‌కాశం జిల్లా కారంచేడులో అదే ప‌ని చేశారు. గుర్ర‌మెక్కి కాసేపు ఆల‌రించారు. నందమూరి బాలకృష్ణ సంక్రాంతి సంద‌ర్భంగా త‌న సోద‌రి ద‌గ్గుబాటి పురంధేశ్వ‌రి నివాసానికి వెళ్ళారు.

అక్క‌డే కుటుంబ స‌భ్యుల‌తో పండ‌గ చేసుకున్నారు. ఈ సంక్రాంతి వేడుక‌ల్లో నందమూరి బాలకృష్ణతోపాటు ఆయ‌న భార్య వ‌సుంధ‌ర‌, కొడుకు మోక్షజ్ఞలు కూడా పాల్గొన్నారు. కారంచేడుకు బాల‌య్య వ‌చ్చాడ‌ని తెలుసుకున్న ఆయ‌న అభిమానులు చూసేందుకు అక్క‌డ‌కు పెద్ద ఎత్తున త‌ర‌లివ‌చ్చారు. దీంతో ఆ ప్రాంతం అంతా కోలాహ‌లంగా మారింది.

Next Story
Share it