Telugu Gateway
Cinema

చీరాల బీచ్ లో 'బాలకృష్ణ సంద‌డి'

చీరాల బీచ్ లో బాలకృష్ణ సంద‌డి
X

నంద‌మూరి బాలకృష్ణ ఈ సారి సంక్రాంతి పండ‌గ‌ కుటుంబ స‌మేతంగా కారంచేడులోని త‌న అక్క‌ దగ్గుబాటి పురంధేశ్వ‌రి ఇంట్లో చేసుకున్నారు. శ‌నివారం నాడు గుర్రం ఎక్కి కాసేపు హ‌ల్ చ‌ల్ చేసిన బాలకృష్ణ..ఆదివారం నాడు చీరాల బీచ్ లో త‌న భార్య వ‌సుంధ‌ర‌తో క‌ల‌సి జీప్ న‌డుపుతూ హ‌డావుడి చేశారు. బీచ్ లో కుటుంబ స‌భ్యులంద‌రూ క‌ల‌సి కూర్చుని ఫ్యామిలీ టైమ్ ఎంజాయ్ చేశారు. దీనికి సంబంధించిన వీడియోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయ్యాయి. ఇందులో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు, పురందేశ్వ‌రితోపాటు ఎన్టీఆర్ కుమార్తెలు మ‌రికొంత మంది కూడా పాల్గొన్నారు.

Next Story
Share it