Telugu Gateway
Cinema

నాగార్జున 'వైల్డ్ డాగ్' విడుదల ఏప్రిల్ 2న

నాగార్జున వైల్డ్ డాగ్ విడుదల ఏప్రిల్ 2న
X

గత ఏడాది అక్కినేని నాగార్జున ఓ వైపు బిగ్ బాస్ షో చేస్తూనే మరో వైపు వైల్డ్ డాగ్ సినిమా షూటింగ్ కూడా పూర్తి చేశాడు. ఈ సినిమా తొలుత ఓటీటీలో విడుదల అవుతుందని భావించారు. కానీ చిత్ర యూనిట్ తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి ప్రకటించింది. ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదల కానుంది.

పూణె, కులుమనాలీ, ముంబై సహా పలు ప్రాంతాల్లో షూటింగ్‌ జరుపుకున్న ఈ యాక్షన్‌ థ్రిల్లర్‌ చిత్రంలో దియా మీర్జా, సైయామీ ఖేర్‌, అటుల్‌ కులకర్ణి, అలీ రెజా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై నిరంజన్‌ రెడ్డి, అన్వేశ్‌ రెడ్డి నిర్మించారు.

Next Story
Share it