Telugu Gateway
Cinema

స‌మంత‌, నాగ చైత‌న్య విడాకులు..నాగార్జున ట్వీట్

స‌మంత‌, నాగ చైత‌న్య విడాకులు..నాగార్జున ట్వీట్
X

టాలీవుడ్ లో గ‌త కొంత కాలంగా ఇదే అంశం హాట్ టాపిక్ గా మారింది. అయితే దీనిపై శ‌నివారం నాడు నాగ‌చైత‌న్య‌, స‌మంత‌ల నుంచి అధికారిక ప్ర‌క‌ట‌న వెలువ‌డినప్ప‌టి నుంచి మీడియాలో ఒక‌టే హడావుడి. వీరిద్దరి విడాకుల అంశంపై ప్ర‌ముఖ హీరో, నాగ‌చైత‌న్య తండ్రి నాగార్జున కూడా స్పందించారు. చైతూ-సమంత విడిపోవడం దురదృష్టకరమన్నారు. భార్యభర్తలు విడిపోవడం వారి వ్యక్తిగత విషయమని ట్వీట్‌ చేశారు. సమంత ఫ్యామిలీ ఎల్లప్పుడూ తమకు ఆత్మీయులేనని, చైతు-సమంత ఎప్పటికీ తన గుండెల్లో ఉంటారని నాగార్జున పేర్కొన్నారు. 'ఎంతో బరువైన హృదయంతో ఈ విషయాన్ని చెప్పాల్సి వస్తోంది.

చైతు-సమంత విడిపోవటం దురదృష్టకరం. సమంత, నాగచైతన్య ఇద్దరూ నాకెంతో దగ్గరి వారు. సమంతతో నా కుటుంబం గడిపిన ప్రతి క్షణం ఎంతో మధురమైంది. దేవుడు వాళ్లిద్దరికీ మనో ధైర్యాన్ని ఇవ్వాలని ప్రార్థిస్తున్నా. వారికి నా ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి'అని నాగ్‌ ట్వీట్‌ చేశాడు. సమంతతో విడాకులు తీసుకోనున్నట్లు శనివారం సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు చైతన్య. ఎంతో ఆలోచించి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.

Next Story
Share it