నాగార్జున కొత్త సినిమా ప్రారంభం
BY Admin20 Aug 2021 11:00 AM

X
Admin20 Aug 2021 11:00 AM
అక్కినేని నాగార్జున కొత్త సినిమా శుక్రవారం నాడు హైదరాబాద్ లో ప్రారంభం అయింది. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు ప్రీక్వెల్ గా ఈ సినిమా వస్తోంది. బంగార్రాజుగా ఈ సినిమాకు టైటిల్ ఫిక్స్ చేశారు. సోగ్గాడే చిన్నినాయన సినిమాకు దర్శకత్వం వహించిన కళ్యాణ్ క్రిష్ణ దర్శకత్వంలోనే ఇది తెరకెక్కనుంది.
ఈ సినిమాలో నాగార్జునతోపాటు అక్కినేని నాగచైతన్య, కృతి శెట్టిలు జోడీగా నటించనున్నారు. అన్నపూర్ణ స్టూడియోలో ఈ సినిమా షూటింగ్ లాంఛనంగా ప్రారంభం అయింది. 2016లో విడుదల అయిన సొగ్గాడే చిన్ని నాయన సినిమా మంచి ఆదరణ దక్కించుకుంది.
Next Story