వెల్లంపల్లి..కొడాలిని పెట్టి సినిమాలు తీయండి
ఏపీ సర్కారుపై నటుడు నాగబాబు మరోసారి మండిపడ్డారు. ఆయన సోమవారం నాడు ఓ వీడియో విడుదల చేశారు. ఇందులో సర్కారు తీరుపై తీవ్ర విమర్శలు గుప్పించారు. 'ఆంధ్రప్రదేశ్ లో ఏ వ్యాపారం అయినా మీ చేతుల్లోకి తీసుకుంటున్నారు కదా. అలాగే సినిమా పరిశ్రమనూ ఆంధ్రా వరకూ మీరే తీసుకోండి.. వెల్లంపల్లి, కొడాలి వంటి వారిని హీరోలుగా పెట్టి సినిమాలు తీయండి. వాళ్లు బాగా నటిస్తారు. వాళ్ల నటన ముందు మేం అసలు సరిపోం. లేదంటే ఆంధ్రాలో తెలుగు సినిమాలు బ్యాన్ చేయండి. కొన్ని రోజులు నష్టపోతాం. వేరే దారి చూసుకుని సినిమా విడుదల చేసుకుంటాం. టెక్నాలజీ బాగా పెరిగింది. ఓటీటీ, యూట్యూబ్ లో చూసుకున్నా మాకు బాగానే డబ్బులు వస్తాయి. ' అంటూ వ్యాఖ్యానించారు. భీమ్లానాయక్ సినిమాకు ప్రభుత్వం ఇబ్బందులు కల్పించేందనే ఉద్దేశంతో నాగబాబు గత కొన్ని రోజులుగా ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు. 'వైసిపి ప్రభుత్వం కి, వాళ్ళ మినిస్టర్స్ కు సినిమా వాళ్ళ ఆపరేషన్స్ గురించి తెలీదు. సామాన్యుడికి టిక్కెట్ ధర అందుబాటులో వుండాలి అనే విషయాన్ని నేను ఏకీభవిస్తాను. అయితే సినిమా ప్రపంచ వ్యాప్తంగా పెరగాలి అంటే సినిమాకీ రిచ్ నెస్, గ్రాండియర్ తీసుకురావాలి. టోటల్ సినిమా బడ్జెట్ లో హీరోల రెమ్యునరేషన్ లు పది లేదా పన్నెండు పర్సెంట్ ఉంటుంది. కొన్ని సార్లు మారుతుంటుఉంది.
రెమ్యునరేషన్ ఖర్చు కాదు అనే అజ్ఞానపు మాటలు మాట్లాడే వాళ్లకు సినిమా మేకింగ్ గురించి ఏమి అర్ధం అవుతుంది. రెమ్యునరేషన్ అంటే సినిమా ఖర్చులో భాగం. ఎంత మంది హీరోలు ఎన్ని సినిమాలకు వాళ్ళ రెమ్యునరేషన్ తగ్గించుకున్నారు. ఎంత వెనక్కి ఇచ్చారు. అనే డేటా మీ దగ్గర లేదు. అత్తారింటికి దారేది సినిమా నిర్మాతకు నష్టం వస్తే, పవన్ కళ్యాణ్ కోట్ల రూపాయలు వెనక్కీ ఇచ్చి ఆదుకున్నాడు. జానీ సినిమాకీ ఆర్టిస్ట్ గా దర్శకుడి గా తన రెమ్యునరేషన్ వదిలేసుకున్నాడు. చిరంజీవి ..అంజి సినిమాకీ తన రెమ్యునరేషన్ మాగ్జి మమ్ వదిలేసుకొని చేశారు. నా వైపే చూస్తే చరణ్ కి నేనే 70 పర్సెంట్ రెమ్యునరేషన్ ఇవ్వలేక పోయాను. మహేష్, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్ వీళ్ళు కూడా రెమ్యునరేషన్ తగ్గించడమో వెనక్కి ఇవ్వడమో జరుగుతుంది. అందరూ మెడలో బోర్డు లు వేసుకొని మేము ఇంత రెమ్యునరేషన్ తగ్గించాము అని తిరగరు.
ఏ హిరో అయినా పిక్చర్ బాగా బిజినెస్ అయితే రెమ్యునరేషన్ తీసుకుంటారు. చాలా మంది రెమ్యునరేషన్ విషయంలో ఫ్లెక్సి బుల్ గా వుంటారు. అంతెందుకు మా అబ్బాయి వరుణ్ 'అంతరిక్షం' సినిమాకీ 30పర్సెంట్ కూడా తీసుకోలేదు.' అని తెలిపారు. తమ సోదరుల మధ్య గొడవ పెట్టే దమ్ము మీకు ఉందా అంటూ మండిపడ్డారు. ఆదివారం నాడు మంత్రి పేర్ని నాని...చిరంజీవిని అవమానించేలా పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారని..ఇది సరికాదంటూ మీడియాతో మాట్లాడిన విషయం తెలిసిందే. దీనిపైనే నాగబాబు స్పందిస్తూ పలు అంశాలను లేవనెత్తారు. వాళ్లకు ఉన్న వ్యక్తిగత ఏజెండాల ప్రకారమే దాడులు చేస్తున్నారని ఆరోపించారు.సీఎం జగన్ తన రెండేళ్ళ పదవి కాలాన్ని అయినా పగ, ప్రతీకారాలు వదిలేసి పాలన చేయాలంటూ సూచించారు. ప్రభుత్వాలతో సంబంధం లేకుండా ఆదాయం పెంచుకునే విషయం ఆలోచించాలని..పరిశ్రమలోని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. మెగా అభిమానులు ఎవరూ ఆవేశపడొద్దని..దీన్ని సమయం వచ్చినప్పుడు చూపిద్దామని పేర్కొన్నారు.