Telugu Gateway
Cinema

ఈ సారి అయినా కలిసొస్తుందా!

ఈ సారి అయినా కలిసొస్తుందా!
X

హీరో నాగ శౌర్య కు హిట్ లేక చాలా కాలమే అయింది. ఆయన చేసిన చివరి సినిమా రంగబలి. ఇది 2023 లో విడుదల అయింది. కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు బ్యాడ్ బాయ్ కార్తీక్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ను ఆయన పుట్టిన రోజు సందర్భంగా బుధవారం నాడు విడుదల చేశారు. రామ్ దేసిన దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీని వైష్ణవి ఫిల్మ్స్ బ్యానర్ పై నిర్మిస్తున్నారు.

పవర్ ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా ఈ మూవీ తెరకెక్కనుంది. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు హరీష్ జైరాజ్ సంగీతం అందిస్తున్నారు. నాగ శౌర్య కు మరో హిట్ దక్కితే కానీ ఆయన కెరీర్ గాడిన పడే అవకాశం లేదు. ఈ సినిమాలో నాగ శౌర్య కు జోడిగా విధి నటిస్తోంది. సముధ్రఖని తో పాటు వి కె నరేష్ లు కూడా కీలక పాత్రల్లో కనిపించనున్నారు. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

Next Story
Share it