Telugu Gateway
Cinema

అదరగొట్టిన నాగశౌర్య 'ల‌క్ష్య'

అదరగొట్టిన నాగశౌర్య ల‌క్ష్య
X

న్యూలుక్. న్యూ సినిమా. హీరో నాగశౌర్య కొత్త సినిమా 'ల‌క్ష్య' టైటిల్ తోపాటు న్యూలుక్ ను విడుదల చేసింది చిత్ర యూనిట్. కండలు తిరిగి శరీర సౌష్టవంతో, డిఫరెంట్‌గా నాగ‌శౌర్య లుక్ అంద‌రినీ ఆశ్చర్యపర్చింది. నాగశౌర్య లీడ్‌ రోల్‌ పోషిస్తున్న ఈ సినిమా విలువిద్య నేపథ్యంలో తెరకెక్కుతున్న తొలి భారతీయ మూవీ అని చిత్ర యూనిట్‌ చెబుతోంది. ఈ చిత్రంలో ఆర్చర్ పాత్రలో కనిపిస్తున్నాడు నాగశైర్య. సంతోష్‌ జాగర్లపూడి దర్శకత్వంలో యంగ్‌ హీరో నాగశౌర్యకు జోడిగా కేతికా శర్మ నటిస్తోంది.

సోనాలి నారంగ్ స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పి, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప‌తాకాల‌పై ప్ర‌ముఖ నిర్మాత‌లు నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ మూవీలో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు మరో ప్రత్యేక పాత్రలో కనిపించనున్నారు.

Next Story
Share it