నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త సినిమా షురూ
BY Admin15 Feb 2021 9:17 AM IST
X
Admin15 Feb 2021 9:30 AM IST
టాలీవుడ్ లో మైత్రీ మూవీమేకర్స్ దుమ్మురేపుతోంది. వరస పెట్టి సినిమాలు చేస్తోంది. హీరో ఎవరైనా..దర్శకుడు ఎవరైనా సినిమా నిర్మాణ సంస్థ మాత్రం మైత్రీ మూవీ మేకర్సే అన్న చందంగా సాగుతోంది. ఓ వైపు భారీ బడ్జెట్ సినిమాలతో పాటు చిన్న సినిమాల నిర్మాణంలో భాగస్వామి అవుతోంది ఈ సంస్థ.
తాజాగా ఈ సంస్థ నుంచి వచ్చిన ఉప్పెన వసూళ్ళపరంగా మంచి ఫలితాలు రాబడుతోంది. తాజాగా నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా ప్రారంభించింది. ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమం సోమవారం నాడు జరిగింది. రాజేంద్ర దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది.
Next Story