రవి తేజ లో అదే జోష్
సక్సెస్ ఫెయిల్యూర్స్ ఇంటికి వచ్చే చుట్టాలు లాంటివి. వస్తుంటాయి..పోతున్నాయి. యాటిట్యూడ్ ఇంటి పేరు లాంటిది. అది పోయేదాకా మనతోనే ఉంటుంది అంటూ రవి తేజ చెప్పే పవర్ ఫుల్ డైలాగు టీజర్ లో హై లైట్ గా చెప్పొచ్చు. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే గ్లామర్ డోస్ కూడా బాగానే ఉన్నట్లు టీజర్ చూస్తే కనిపిస్తోంది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్స్ ను పెంచి టీజర్ ను ప్రేక్షకుల ముందుకు తెచ్చారు. మిస్టర్ బచ్చన్ ప్రపంచ వ్యాప్తంగా ఆగస్ట్ 15 న విడుదల అవుతుంటే...ఆగస్ట్ 14 నే ప్రీమియర్స్ వేయనున్నట్లు చిత్ర యూనిట్ ఇప్పటికే అధికారికంగా ప్రకటించింది.