Telugu Gateway
Cinema

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ టీజర్ వచ్చేసింది

మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్ టీజర్ వచ్చేసింది
X

'మ్యారేజ్ లైఫ్ నుంచి మీరు ఏమి ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఇది అఖిల్ ప్రశ్న. దీనికి పూజా హెగ్డె సమాధానం. ఆ...ఇడ్లీ, వడ, సాంబార్ అంటూ తటుక్కున తలుపు డోర్ మూసివేస్తుంది. 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్ ' సినిమాకు సంబంధించి టీజర్ లో సన్నివేశాలు ఇవి. ఈ టీజర్ ఆసక్తికరంగా ఉంది. దసరాను పురస్కరించుకుని చిత్ర యూనిట్ విడుదల చేసిన టీజర్ లో అక్కినేని అఖిల్ పెళ్ళి ఇంటర్యూలు సరదగా సాగుతాయి.

బొమ్మరిల్లు 'భాస్కర్' దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. సరికొత్త డైలాగ్‌లతో ఉన్న టీజర్‌ ఈ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ప్రస్తుతం ఈ మూవీ టీజర్‌ నెటిజన్లను ఆకట్టుకుంటోంది. అల్లు అరవింద్‌ సమర్పణలో జిఏ2 పిక్చర్స్‌ బ్యానర్‌లో బన్నీ వాసు, వాసూవర్మ 'మోస్ట్‌ ఎలిజిబుల్‌ బ్యాచ్‌లర్‌' మూవీని నిర్మిస్తున్నారు. 2021 సంక్రాంతికి ఈ సినిమా విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు.

Next Story
Share it