'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' వచ్చేస్తున్నాడు
సినిమాలు క్యూ కడుతున్నాయి. కరోనా కారణంగా ఎప్పటి నుంచో ఆగిపోయిన సినిమాలు వైరస్ కాస్త శాంతించటంతోపాటు థియేటర్లలో సందడి పెరుగుతోంది. ఇప్పటికే పలు సినిమాలు విడుదల కాగా..కొత్తగా పలు సినిమాలు ఇప్పుడు విడుదల తేదీలు ప్రకటిస్తున్నాయి. అక్కినేని అఖిల్, పూజా హెగ్డె జంటగా నటించిన సినిమా 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్'. ఈ సినిమాను అక్టోబర్ 8న విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్ శనివారం నాడు ప్రకటించింది. అమితమైన ప్రేమ..నవ్వులు..ఎంటర్ టైన్ మెంట్ తీసుకొస్తున్నాం..రెడీగా ఉండండి అంటూ పేర్కొన్నారు.
బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కగా..గీతా ఆర్ట్స్ నిర్మాణ సంస్థ. అఖిల్ ఈ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు. గతంలో ఈ హీరో చేసిన సినిమాలు అన్నీ ఓ మోస్తరుగా ఆడినవే తప్ప..ఇంత వరకూ ఒక్క సూపర్ హిట్ అంటూ కూడా లేదు. వరస పెట్టి హిట్స్ దక్కించుకుంటున్న పూజా హెగ్డె ఈ సినిమాలో హీరోయిన్ గా ఉండటం కూడా ఓ పాజిటివ్ పాయింట్ గా భావిస్తున్నారు. మరి ప్రస్తుతం టాలీవుడ్ లక్కీ హీరోయిన్లలో ఒకరైన పూజాతో కలసి చేసిన సినిమా అయినా అఖిల్ కు కలసి వస్తుందో లేదో వేచిచూడాల్సిందే.