'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్' వస్తున్నాడు
BY Admin3 Feb 2021 5:43 PM IST
X
Admin3 Feb 2021 5:43 PM IST
అక్కినేని అఖిల్, పూజా హెగ్డె నటించిన సినిమా 'మోస్ట్ ఎలిజబుల్ బ్యాచ్ లర్'. ఈ చిత్ర యూనిట్ కూడా విడుదల తేదీని ప్రకటించేసింది. జూన్ 19న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. సరైన హిట్ లేక ఇబ్బంది పడుతున్న అఖిల్ ఈ బ్యాచ్ లర్ సినిమాపై భారీ ఆశలే పెట్టుకున్నాడు.
పూజా హెగ్డె కూడా ఉండటం కలసి వచ్చే అంశంగా చిత్ర యూనిట్ నమ్ముతోంది. మరి ఈ ప్రయత్నం ఎలాంటి ఫలితాన్ని ఇస్తుందో వేచిచూడాల్సిందే. బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాను అల్లు అరవింద్, బన్నీవాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు.
Next Story