రజనీ కాంత్ , మోహన్ బాబు ఇద్దరూ మంచి ఫ్రెండ్స్ అనే విషయం తెలిసిందే. ఇటీవల వీళ్ళిద్దరూ కలిసి ఒకే విమానంలో పక్క పక్క సీట్లలో కూర్చుని ప్రయాణించారు. ఈ ఫోటోను మోహన్ బాబు సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే కాదు...అప్పుడు...ఇప్పుడూ స్నేహమేరా జీవితం అంటూ ఆ ఫోటో కింద క్యాప్షన్ పెట్టారు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియా లో వైరల్ పిక్ గా మారింది. రజనీ కాంత్ ప్రస్తుతం వెట్టయాన్, కూలీ సినిమాల్లో నటిస్తున్నారు. హైదరాబాద్ లో జరుగుతున్న కూలీ లాంగ్ షెడ్యూల్ లో రజనీకాంత్ పాల్గొననున్నారు. మరో వైపు మోహన్ బాబు కన్నప్ప సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న విషయం తెలిసిందే. ఇందులో మోహన్ బాబు తనయుడు మంచు విష్ణు తో పాటు ప్రభాస్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు.