పవన్ సినిమా కార్యక్రమానికి కెటీఆర్
BY Admin19 Feb 2022 8:45 AM

X
Admin19 Feb 2022 8:45 AM
పవన్ కళ్యాణ్, దగ్గుబాటి రానాలు నటించిన బీమ్లానాయక్ సినిమా ఫిబ్రవరి 25న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫిబ్రవరి 21న హైదరాబాద్ లో జరగనుంది. ఈ కార్యక్రమానికి తెలంగాణ ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి కెటీఆర్ ముఖ్య అతిధిగా హాజరుకానున్నారు. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడించింది. ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, సితార ఎంటర్ టైన్ మెంట్స్ అధినేత చినబాబు, సూర్యదేవర నాగవంశీలు శనివారం నాడు మంత్రి కెటీఆర్ తో సమావేశం అయ్యారు.
Next Story