Telugu Gateway
Cinema

'లైగ‌ర్' మూవీలో మైక్ టైసన్

లైగ‌ర్ మూవీలో  మైక్ టైసన్
X

విజ‌య్ దేవ‌ర‌కొండ న‌టిస్తున్న సినిమా లైగ‌ర్. పూరీ జ‌గ‌న్నాథ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమా బాక్సింగ్ నేప‌థ్యంలో నిర్మిస్తున్నారు. చిత్ర యూనిట్ ముందు ప్ర‌క‌టించిన‌ట్లుగా సోమ‌వారం సాయంత్రం కీల‌క అప్ డేట్ ఇచ్చింది. ఈ సినిమాలో విజ‌య‌దేవ‌ర‌కొండ‌తోపాటు మైక్ టైస‌న్ న‌టిస్తున్న‌ట్లు వెల్ల‌డించింది. దీనికి సంబంధించిన కొత్త లుక్ ను విడుద‌ల చేసింది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు జోడీగా ఈ సినిమాలో అన‌న్య‌పాండే న‌టిస్తున్న విష‌యం తెలిసిందే.

పాన్ ఇండియా సినిమాగా ఇది తెర‌కెక్కుతోంది. తెలుగు, త‌మిళం, హిందీ, మ‌ళ‌యాళం, క‌న్న‌డ‌లో ఇది విడుద‌ల కానుంది. క‌ర‌ణ్ జోహ‌ర్ కు చెందిన ధ‌ర్మ ప్రొడ‌క్షన్స్, పూరీ క‌నెక్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. మైక్ టైస‌న్ ఈ సినిమాలోకి ఎంట్రీ ఇవ్వ‌టంతో లైగ‌ర్ అంచ‌నాలు మ‌రింత పెరిగాయ‌ని చెప్పొచ్చు.బాక్సింగ్ క‌థ కావ‌టంతో ఈ సినిమాలో మైక్ టైస‌న్ ను కీల‌క పాత్ర‌కు ఎంపిక చేసిన‌ట్లు స‌మాచారం.

Next Story
Share it