'ఆచార్య' రేట్లు ఎందుకు పెంచారంటే..50 కోట్లు వడ్డీలు కట్టారంట
అంతకు ముందు దర్శకుడు కొరటాల శివ మాట్లాడుతూ మరింత విచిత్రంగా స్పందించారు. తాము ఇంత వరకూ రెమ్యునరేషన్లు తీసుకోలేదు..లెక్కలు చూసుకోలేదు అంటూ వ్యాఖ్యానించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో హోం శాఖ ఇప్పుడు ఎక్కువ బిజీగా ఉన్నది కొత్త సినిమాల టిక్కెట్ రేట్ల పెంపు జీవోల జారీలోనే అని అధికారులు వ్యంగాస్త్రాలు సందిస్తున్నారు. రాధేశ్యామ్, ఆర్ఆర్ఆర్, కెజీఎఫ్2, ఇప్పుడు ఆచార్య సినిమాల విషయంలో అదే జరిగింది. సినిమా సినిమాకు ఇలా దరఖాస్తు చేసుకోవటం..సర్కారు ఇలా ప్రతిదానికి విడివిడిగా అనుమతులు ఇవ్వటం వెనక ఏదో మతలబు ఉందని పరిశ్రమ వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. ఒక విధానం తెచ్చి ఈ సినిమాకు అయినా అదే వర్తిస్తుందని చెప్పటం పద్దతి కానీ..ఇలా విడి విడిగా నిర్ణయాలు..విడి విడిగా రేట్లు పెంపు అన్నది ఏ మాత్రం సరైన విధానం కాదనే విమర్శలు ఉన్నాయి.