Telugu Gateway
Cinema

చిరంజీవి 'భోళా శంకర్‌'

చిరంజీవి భోళా శంకర్‌
X

మెగాస్టార్ చిరంజీవి కుర్ర‌హీరోల‌కు ఏ మాత్రం త‌గ్గ‌టంలేదు. ఒక్క మాట‌లో చెప్పాలంటే వాళ్ల కంటే దూకుడు మీద ఉన్నాడు. వ‌ర‌స‌గా కొత్త సినిమాల‌కు ఓకే చేస్తూ దూసుకెళుతున్నాడు. శ‌నివారం నాడు గాడ్ పాద‌ర్ సినిమా ప్ర‌క‌ట‌న రాగా..ఆయ‌న పుట్టిన రోజు అయిన ఆదివారం నాడు మ‌రో సినిమా లైన్ లోకి వ‌చ్చేసింది. అదే 'భోళా శంకర్‌' మూవీ. ఇది చిరంజీవి 154వ సినిమా. ఆదివారం సాయంత్రం మ‌రో సినిమా కూడా రావాల్సి ఉంది. మెహర్‌ రమేష్‌ దర్శకత్వంలో రానున్న ఈ సినిమాకు సంబంధించిన అప్‌డేట్‌ను ప్రకటించారు చిత్ర యూనిట్. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ఈ మూవీ టైటిల్‌ మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేశారు.

ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని అనిల్‌ సుంకర నిర్మిస్తున్నారు. తమిళ్ బ్లాక్ బస్టర్ అయిన 'వేదాళం రీమేక్ గా ఈ చిత్రాన్ని తెర‌కెక్కిస్తున్నారు. త‌మిళ సినిమాలో అజిత్ హీరోగా నటించాడు. ఈ తెలుగు రీమేక్ లో ముందుగా పవన్ నటించాల్సి ఉంది. కానీ ఇది ప‌ట్టాలెక్క‌లేదు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి ఈ రీమేక్ చేయబోతున్నారు. ఇప్ప‌టికే చిరంజీవి ఆచార్య సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న విష‌యం తెలిసిందే.

Next Story
Share it