Telugu Gateway
Cinema

'మెగా 154' మొద‌లైంది

మెగా 154 మొద‌లైంది
X

చిరంజీవి కొత్త సినిమా ప్రారంభం అయింది. మెగా 154 పేరుతో తెర‌కెక్కుతున్న ఈ సినిమాకు బాబీ ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మైత్రీ మూవీ మేక‌ర్స్ చిత్ర నిర్మాణ సంస్థ‌గా ఉంది.ఇప్ప‌టికే ప్ర‌క‌టించిన ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు శ‌నివారం నాడు హైద‌రాబాద్ లో జ‌రిగాయి. టాలీవుడ్ కు చెందిన ప‌లువురు ఈ కా్ర్య‌క్ర‌మంలో పాల్గొని చిరంజీవితోపాటు చిత్ర యూనిట్ కు అభినంద‌నలు తెలిపారు. ఈ సంద్భంగా చిత్ర యూనిట్ చిరంజీవి న్యూ లుక్ ను విడుద‌ల చేసింది.

ఈ సినిమా ప్రారంభం అవుతున్న వేళ ద‌ర్శ‌కుడు బాబీ సంతోషం వ్య‌క్తం చేస్తూ ఎప్పుడో 18 సంవ‌త్స‌రాల క్రితం చిరంజీవితో క‌ల‌సి దిగిన ఫోటోను షేర్ చేస్తూ సంతోషం వ్య‌క్తం చేశారు. మెగాస్టార్..ఆ పేరు వింటే అంతులేని ఉత్సాహం..ఆయ‌న పోస్ట‌ర్ చూస్తే అర్ధం కాని ఆరాటం. తెర‌మీద ఆయ‌న క‌న‌ప‌డితే ఒళ్లు తెలియ‌ని పూన‌కం అంటూ రాశారు. ఈ కొత్త ప్రాజెక్టుకు దేవీశ్రీ ప్ర‌సాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Next Story
Share it