నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్

రవి తేజ, శ్రీలీల జంటగా నటించిన సినిమా మాస్ జాతర. గతంలో వీళ్ళిద్దరూ కలిసి చేసిన ధమాకా బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ హిట్ కావటంతో ఇదే కాంబినేషన్ మరో సారి హిట్ మ్యాజిక్ రిపీట్ చేస్తుంది అనే అంచనాలు రాప్పడ్డాయి తొలుత. కాకపోతే ప్రేక్షకుల అంచనాలను అందుకోవడంలో మాస్ జాతర సినిమా ఫెయిల్ అయింది. దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన ఈ మూవీ నవంబర్ ఒకటిన ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.
ఈ సినిమా పై ఎన్నో అసలు పెట్టుకున్న రవితేజ కు మరో సారి నిరాశే ఎదురైంది. బాక్స్ ఆఫీస్ వద్ద ప్లాప్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. నవంబర్ 28 నుంచి ఈ సినిమా ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. హిందీ తప్పించి అన్ని భారతీయ భాషల్లో ఇది అందుబాటులో ఉంటుంది అని తెలిపారు. సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన ఈ సినిమాకు భీమ్స్ సంగీతం అందించారు.



