Telugu Gateway
Cinema

స్ట్రీమింగ్ ఎక్కడ అంటే !

స్ట్రీమింగ్ ఎక్కడ అంటే !
X

బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని విజయాన్ని దక్కించుకున్న సినిమా మండాడి. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 150 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లు సాధించి రికార్డు నమోదు చేసింది. విడుదల తర్వాత ఈ సినిమాకు రివ్యూల పరంగా చూసుకుంటే మిశ్రమ స్పందనలే వ్యక్తం అయినా కూడా ప్రేక్షకుల నుంచి మాత్రం మంచి ఆదరణ దక్కించుకుంది. ముఖ్యంగా ఈ సినిమాలో సముద్రపు అలల మధ్య సాగే పోరాట సన్నివేశాలు ప్రేక్షకులకు బాగా నచ్చాయి. తమిళ హీరో సూరి, టాలీవుడ్ హీరో సుహాస్ లు ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటించిన సంగతి తెలిసిందే. బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాన్ని దక్కించుకున్న ఈ సినిమా ఇప్పుడు ఓటిటి లోకి వస్తోంది. ప్రముఖ ఓటిటి ఫ్లాట్ ఫార్మ్ నెట్ ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ కానుంది.

అక్టోబర్ 8 నుంచి ఈ సినిమా తెలుగు తో పాటు తమిళ్, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో అందుబాటులో ఉంటుంది అని అధికారికంగా వెల్లడించారు. మతిమారన్ పుగజేంధి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా సెప్టెంబర్ 10 న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో సూరి ‘కాళి’ అనే శక్తిమంతమైన పాత్రలో తన నటనతో ప్రశంసలు అందుకున్నారు. సుహాస్ నటనకు కూడా మంచి ప్రశంసలు దక్కాయి. సముద్రపు అలల మధ్య సాగే ఉత్కంఠభరిత పోరాటాలు, సహజసిద్ధమైన ఎమోషన్స్ థియేటర్లలో ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. మరి ఓటిటి లోకి వచ్చిన తర్వాత ఈ సినిమా ఎన్ని రికార్డు లు నమోదు చేస్తుందో చూడాలి.

Next Story
Share it