ప్రకాష్ రాజ్...అలా చేస్తే మర్యాద ఉండదు
'అవును. నా కోసం మా నాన్న ఫోన్లు చేసి అడుగుతున్నారు. అందులో తప్పేముంది. ఏదైనా ఉంటే నా గురించి మాట్లాడు. ఇంకో సారి మా నాన్న , అక్క, తమ్ముడు..మంచు ఫ్యామిలీ అంటే మర్యాద ఉండదు. ఇప్పటివరకూ ప్రకాష్ రాజ్ గారు అని గౌరవించి మాట్లాడుతున్నా. మళ్లీ ఇది రీపిట్ అయితే ఆ గారు కూడా ఉండదు.' అంటూ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల్లో ప్యానల్ తో బరిలో నిలిచిన మంచు విష్ణు వార్నింగ్ ఇచ్చారు. ఆయన సీనియర్ నటుడు నరేష్ తో కలసి ప్రకాష్ రాజ్ తమ ప్యానల్ పై చేసిన ఫిర్యాదులకు సంబంధించి వివరణ ఇచ్చారు. 'ప్రకాశ్‌రాజ్‌కు బీపీ మాత్ర ఇస్తే బాగుంటుంది. ఆయన అపరిచితుడిలా వ్యవహరిస్తున్నారు. మీడియా ముందు మొసలి కన్నీరు కారుస్తున్నారు. రియల్ లైఫ్‌లోనూ ఆయన బాగా నటిస్తున్నారు. నేరాలు-ఘోరాలు జరిగిపోతున్నాయని అంటున్నారు. ఆయనకు పగ-ద్వేషాలు ఎందుకో నాకు తెలియడం లేదు'అన్నారు. 'మా'లో సుమారు 190మంది 60 సంవత్సరాలు పైబడిన వాళ్లు ఉన్నారు. వీళ్లందరినీ నేను వ్యక్తిగతం ఫోన్ చేశా. 'మీకు పోస్టల్ బ్యాలెట్ కావాలా? నేరుగా వచ్చి ఓటు వేస్తామని 100మందికి పైగా చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్నవాళ్లు, ఇక్కడే నగరంలో ఉన్న పరుచూరి బ్రదర్స్ వంటి పెద్దలు 'పోస్టల్ బ్యాలెట్‌కు వెళ్తా'మని చెప్పారు. అయితే, మీరు ఒక లేఖ ఎన్నికల సంఘానికి పంపాలని సూచించా. ఎలా పంపాలో వాళ్లకు తెలియకపోతే ఒక లెటర్ ఫార్మాట్ పంపా. అయితే, ఎవరికి వారే కొరియర్ చేసుకున్నారు. ఆ లెటర్లను ఒక వ్యక్తి మాత్రం తీసుకురాలేదు. పోస్టల్ బ్యాలెట్ కావాలంటే రూ.500 కట్టమని ఎన్నికల సంఘం 'మా' సభ్యులకు ఎస్‌ఎంఎస్ పంపింది.
దాంతో పలువురు పెద్దలు నాకు ఫోన్ చేసి అడిగారు. ఈ ఎన్నికల్లో ప్రతి ఓటూ ముఖ్యమే. అందుకే 'మీ అందరి తరపున ఆ రూ.500 నేను కడతా' అని వాళ్లకు చెప్పా. ఇదే విషయమై ఎన్నికల సంఘం దగ్గరి వచ్చి అడిగాం. వాళ్లు ఒప్పుకొన్నారు. న్యాయబద్ధంగా కట్టాం. కొన్ని గంటల తర్వాత ఎన్నికల సంఘం నుంచి మాకు ఫోన్ వచ్చింది. 'పోస్టల్ బ్యాలెట్‌కు డబ్బులు చెల్లించేందుకు సభ్యులకు సమయం ఇస్తాం. మీ డబ్బులు మీరు తీసుకెళ్లండి' అని చెప్పారు. వాళ్లు చెప్పగానే వచ్చి, డబ్బులు తీసుకున్నాం. అన్నీ లీగల్‌గానే జరిగాయి. ఈ విషయాన్ని తెలుసుకోకుండా ప్రకాశ్ రాజ్ ఏదేదో మాట్లాడుతున్నాడు. నోరు ఉంది కదాని పెద్దా-చిన్నా తేడా లేకుండా ఎలా పడితే అలా మాట్లాడకూడదు. కృష్ణంరాజు, కృష్ణగార్లను అవమానిస్తారా? ప్రకాశ్ రాజ్ మాట్లాడేది చాలా తప్పు. ఇక్కడ 'మా' ఇల్లు నీ పాడు చేసేందుకు కంకణం ఆయన కట్టుకున్నాడు. జీవిత గారు మీరు చెప్పేది కరెక్ట్ గా చెప్పండి .నాలుగు రోజులు ముందు రాజశేఖర్ గారు వచ్చి మోహన్ బాబు గారితో ఏమి చెప్పారో మీకు తెలీదు. ఉమ్మడి కుటుంబం లో కొన్ని సమస్యలు వుంటాయి వాటిని రోడ్డు మీదకు తీసుకు రావద్దు'అని మంచు విష్ణు ఘాటుగా విమర్శలు గుప్పించారు. మా ఎన్నికల్లోకి ప్రకాష్ రాజ్ రాజకీయ ఏజెండా తీసుకొస్తున్నారని ఆరోపించారు.