మా గెలుపును వాళ్లు గౌరవించాలి
మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికలు ముగిసి చాలా రోజులు అయినా కూడా దీనికి సంబంధించి వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. అయితే ఈ వివాదాలపై మా ప్రెసిడెంట్ మంచు విష్ణు కీలక వ్యాఖ్యలు చేశారు. ఇక నుంచి తాను కానీ..తమ సభ్యులు ఎవరూ కూడా వీటిపై మీడియా ఎదుట వీటిపై స్పందించమన్నారు. ఫలితాలపై కూడా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. 'మా' ఎన్నికల్లో మేము గెలిచాం. పత్యర్థి ప్యానల్ వాళ్లు దీన్ని గౌరవించాలి. ఎన్నిక ఫలితాల అనంతరం పత్యర్థి ప్యానల్ వాళ్లు రాజీనామాలు చేశారు. వారి కారణాలు వారికి ఉండొచ్చు. అది చాలా దురదృష్టకరం. అయినా 'మా' అభివృద్ధి కోసం వారిని కలుపుకోనిపోతాం.
'మా' అసోసియేషన్ అభివద్ధికి కోసం ఏ కార్యక్రమాలను చేపట్టిన వారి సలహా తీసుకుంటాను. వారి సపోర్టు నాకు ఉంటుందని ఆశిస్తున్నా'' అని తెలిపారు. ఎన్నికల సమయంలో తనకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి విష్ణు ధన్యవాదాలు తెలిపారు. శనివారం నాడు కొత్త కమిటీ ప్రమాణ స్వీకరాం అనంతరం ఆయన మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రకటించిన మా మేనిఫెస్టోలో ప్రస్తావించిన ప్రతీ అంశం అమలు జరిగేలా చూస్తానని హామి ఇచ్చారు.అలాగే 'మా' అభివృద్ధి కోసం అందరం కలిసి కట్టుగా పని చేద్దామని 'మా' కార్యవర్గానికి పిలుపునిచ్చారు.