డౌట్ క్లియర్ చేసిన మంచు విష్ణు
BY Admin19 Oct 2021 10:33 AM

X
Admin19 Oct 2021 10:33 AM
అలయ్...బలయ్ కార్యక్రమంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మా ప్రెసిడెంట్ మంచు విష్ణు పక్కపక్కనే ఉన్నా కనీసం ముఖాలు కూడా చూసుకోలేదని..మాట్లాడుకోలేదని కొన్ని ఛానళ్ళు ఇటీవల ఊదరగొట్టాయి. అంతే కాదు...నానా హంగామా కూడా చేశాయి. అయితే దీనిపై సోమవారం నాడు తిరుపతిలో మీడియాతో మాట్లాడిన మంచు విష్ణు స్పష్టత ఇచ్చారు. తాము వేదిక కిందే కలుసుకున్నామని..మాట్లాడుకున్నామని తెలిపారు. దీనికి సంబంధించిన మంగళవారం నాడు ఓ వీడియోను కూడా విడుదల చేసి డౌట్ ను క్లియర్ చేశారు. అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరైన పవన్, మంచు విష్ణు ఆలింగనం చేసుకోవటంతోపాటు కొద్దిసేపు మాట్లాడుతుకున్న దృశ్యాలు అందులో కన్పిస్తాయి. అందులోదే ఈ ఫోటో కూడా.
Next Story