‘మంచు బ్రదర్స్’ పంచాయతీ
మంచు మోహన్ బాబు తనయులు రోడ్డున పడ్డారు. సోదరులిద్దరి మధ్య విభేదాలు ఉన్నాయని ఎప్పటినుంచో ప్రచారం జరుగుతోంది. అవి ఇప్పుడు బహిర్గతం అయ్యాయి. మంచు మజోజ్ సోదరుడు మంచు విష్ణు ఒకరి ఇంట్లోకి వెళ్లి దౌర్జన్యం చేసిన వీడియోను స్టేటస్ గా పెట్టుకోవటంతో ఇది బయటకు వచ్చింది. మనోజ్ అనుచరుడిని అన్నయ్య విష్ణు వచ్చి కొట్టడం, దానికి మనోజ్ స్వయంగా ఆ వీడియో తీసి సోషల్ మీడియా లో పెట్టడం చూస్తుంటే ఇద్దరి అన్నదమ్ముల విబేధాలు ఉన్నట్టు స్పష్టం అవుతోంది. ఆ వీడియోలో ఇళ్ల లోకి వచ్చి ఇలా మా బంధువులను కొడుతుంటాడు అంటూ మనోజ్ వాయిస్ వినపడుతుంది. విష్ణును ఆ ఇంట్లో ఉన్న ఇద్దరు పట్టుకున్న చిత్రం చూడొచ్చు. ఈమధ్యనే మంచు మనోజ్ వివాహం, భూమా మౌనికతో జరిగిన విషయం తెలిసిందే.
వివాహం అయిన వెంటనే ఆ దంపతులు ఇద్దరూ వారి కుటుంబాల పెద్దల ఇళ్లకు వెళ్లి వారి ఆశీస్సులు కూడా తీసుకున్నారు. వివాహం అయినపుడు విడుదల చేసిన ఫోటోస్ లో మోహన్ బాబు కూడా ఉండటం తో అతని ఇష్టం తోటే ఈ వివాహం జరిగిందని కూడా అనుకున్నారు. అయితే అ వివాహ ఫోటోల్లో మంచు విష్ణు మాత్రం ఎక్కడా కనిపించలేదు. తిరుపతి లో మంచు మనోజ్ దంపతులు మాట్లాడుతూ చాలామంది తమ వివాహానికి చాలామంది వ్యతిరేకంగా వున్నారని అయినా చివరికి ప్రేమే గెలిచిందని అన్నాడు. అయితే అతని మాటలను బట్టి విష్ణు ఈ వివాహానికి వ్యతిరేకం అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ఇప్పుడు ఈ ఘర్షణ వీడియో దుమారం రేపుతోంది.