Telugu Gateway
Cinema

'మంచిరోజులొచ్చాయ్' పాత్ర‌ల వీడియో

మంచిరోజులొచ్చాయ్  పాత్ర‌ల వీడియో
X

ద‌ర్శ‌కుడు మారుతి కొద్ది రోజుల క్రిత‌మే 'మంచిరోజులొచ్చాయ్' సినిమా ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి పాత్రల‌ ప‌రిచ‌యంతో శ‌నివారం నాడు ఓ వీడియోను విడుద‌ల చేశారు. క‌రోనా ఆధారంగా తెర‌కెక్కుతున్న ఈ సినిమా పూర్తి స్థాయి ఎంట‌ర్ టైనర్ గా క‌న్పిస్తోంది. ఇందులో సంతోష్ శోభ‌న్ హీరోగా న‌టిస్తుంటే..ఆయ‌న‌కు జోడీగా మెహ‌రీన్ సంద‌డి చేయ‌నుంది. అనూప్ రూబెన్స్ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

'మీరు భ‌యానికి భ‌య‌ప‌డి ఎంత‌దూరం పారిపోతే అది మీకు అంత ద‌గ్గ‌ర అవుతుంది. ఆయ‌న మీకు అంత దూరం అవుతారు. నువ్వు చేసిన రెండు సినిమాల‌కే ఇంత ఎక్స్ పీరియ‌న్స్ ఏంటి బావా.' వంటి డైలాగ్స్ తో ఈ వీడియో ఆక‌ట్టుకుంటోంది. ఆ క్యారెక్ట‌ర్లు చూస్తుంటే సినిమా అంతా న‌వ్వుల సంద‌డే ఉండేలా క‌న్పిస్తోంది. ఆరోగ్య‌వంత‌మైన థియేట‌ర్ల‌లోనే త్వ‌ర‌లో విడుద‌ల అని తెలిపారు.

Next Story
Share it