Telugu Gateway
Cinema

కొనసాగుతున్న మన శంకరవర ప్రసాద్ గారు జోష్

కొనసాగుతున్న మన శంకరవర ప్రసాద్ గారు జోష్
X

బాక్స్ ఆఫీస్ దగ్గర చిరంజీవి సినిమా మన శంకర వరప్రసాద్ గారు జోష్ కొనసాగుతూనే ఉంది. కలెక్షన్స్ విషయంలో ఈ సినిమా మిగిలిన వాటి కంటే ఎంతో ముందు వరసలో ఉన్న విషయం తెలిసిందే. కథ కంటే కూడా ముఖ్యంగా సినిమాలో ఎంటర్టైన్మెంట్ ఉండటంతో ఈ సంక్రాంతి సీజన్ లో అతి పెద్ద విన్నర్ గా ఈ మూవీ నిలిచింది అనటంలో ఏ మాత్రం సందేహం లేదు. మరో వైపు గత ఏడాది సంక్రాంతికి దర్శకుడు అనిల్ రావిపూడి సంక్రాంతికి వస్తున్నాం మూవీ తో తన కెరీర్ లోనే అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాను తెరకెక్కించాడు. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 300 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను అధిగమించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో సారి ఈ సంక్రాంతికి తన రికార్డు ను తానే బ్రేక్ చేసుకోబోతున్నట్లు కనిపిస్తోంది.

మన శంకర వరప్రసాద్ గారు మూవీ కూడా థియేట్రికల్ రన్ పూర్తి అయ్యే నాటికి దగ్గర దగ్గర 350 కోట్ల రూపాయల మార్క్ ను క్రాస్ చేసే సూచనలు కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ సినిమా జనవరి 17 నాటికి అంటే శనివారం వరకు 261 కోట్ల రూపాయల గ్రాస్ వసూళ్లను సాధించింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా వెల్లడిస్తూ పోస్టర్ విడుదల చేసింది. ఈ సండే కూడా చిరంజీవి సినిమా కు బుకింగ్స్ ఆశాజనంగానే ఉన్నాయి. దీంతో ఈ మొత్తం మరింత పెరగటం ఖాయం. సోమవారం నుంచి కలెక్షన్స్ తగ్గే అవకాశం ఉంది. అయినా కూడా థియేట్రికల్ పూర్తి అయ్యే నాటికీ గ్యారంటీగా మంచి నంబర్లను నమోదు చేయటం ఖాయంగా కనిపిస్తోంది. జనవరి 12 న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే.

Next Story
Share it