మహేష్ బాబు ఫ్యాన్స్ షాక్!

మహేష్ బాబు, రాజా మౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఎస్ఎస్ఎంబీ 29 మూవీ పై ఇప్పటికే పెద్ద ఎత్తున బజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కు సంబంధించి నవంబర్ 15 న రామోజీ ఫిల్మ్ సిటీ మెగా ఈవెంట్ ప్లాన్ చేశారు. కానీ ఎవరూ ఊహించని విధంగా దర్శకుడు రాజ మౌళి ఈ సినిమాలో విలన్ పాత్ర పోషిస్తున్న ప్రముఖ మళయాళం నటుడు పృథ్వి రాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ ను శుక్రవారం నాడు విడుదల చేశారు. గ్లోబ్ ట్రోటర్ హ్యాష్ ట్యాగ్ తోనే దర్శకుడు రాజమౌళి ఈ సినిమాలో పృథ్వి రాజ్ సుకుమారన్ పాత్ర కుంభ పాత్రలో కనిపించబోతున్నారు అనే విషయాన్ని వెల్లడించారు. ఈ ఫోటో ఇలా బయటకు వచ్చిందో లేదో వెంటనే సోషల్ మీడియాలో ట్రోలింగ్ స్టార్ట్ అయింది. ఇలాంటి ఫొటోలో ఏ ఏ సినిమాల్లో ఉన్నాయో వెంటనే తీసుకొచ్చి పోలికలు మొదలు పెట్టారు.
ఇందులో ప్రధానమైనది సూర్య హీరో గా నటించిన 24 మూవీ లోని స్టిల్ తీసుకొచ్చి ట్రోల్ చేయటం స్టార్ట్ చేశారు. ఇందులో కొత్తదనం ఏముంది అంటూ రాజమౌళికి ప్రశ్నలు సంధిస్తున్నారు. విడిగా చూస్తే పృథ్వి రాజ్ సుకుమారన్ స్టిల్ బాగానే ఉన్నా కూడా ఈ సినిమా ఫస్ట్ లుక్ చూస్తే పలు సినిమాల లుక్స్ తో పాటు ప్రముఖ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త స్టీఫెన్ విలియం హాకింగ్ ఫోటోలు గుర్తుకు రావటం ఖాయం. అయితే రాజమౌళి, మహేష్ బాబుల సినిమా కు సంబంధించి విడుదల అయిన ఫస్ట్ స్టిల్ ఇలా ట్రోలింగ్ ఎదుర్కోవాల్సిన పరిస్థితి రావటం మహేష్ బాబు ఫ్యాన్స్ కు ఏ మాత్రం నచ్చటం లేదు అనే చెప్పొచ్చు.



