Telugu Gateway
Cinema

త్రివిక్రమ్ తో మహేష్ బాబు కొత్త సినిమా

త్రివిక్రమ్ తో మహేష్ బాబు కొత్త సినిమా
X

త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబుల కాంబినేషన్ రిపీట్ కాబోతుంది. అది కూడా పదకొండు సంవత్సరాల తర్వాత. ప్రస్తుతం 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న మహేష్ బాబు అది పూర్తికాగానే త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న సినిమాలో నటించనున్నారు. త్వరలో ప్రారంభం కానున్న ఈ సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలని కూడా ఇప్పటికే నిర్ణయించారు. చిత్ర యూనిట్ అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడించింది.

హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్ పై చినబాబు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. గతంలో మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్ లో అతడు, ఖలేజా సినిమాలు వచ్చిన విషయాలు తెలిసిందే. ఇది మహేష్ బాబు 28వ సినిమా. అయితే ఈ సినిమాలో మహేష్ బాబుకు జోడీగా నటించే హీరోయిన్ ఎవరు..ఇతర నటీనటుల వివరాలు ఇంకా ప్రకటించాల్సి ఉంది.

Next Story
Share it