Telugu Gateway
Cinema

జైపూర్ ఎయిర్ పోర్ట్ లో

జైపూర్ ఎయిర్ పోర్ట్ లో
X

టాలీవుడ్ లోని టాప్ హీరో ల పుట్టిన రోజులు వస్తున్నాయి అంటే వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ కు పండగే. ఎందుకంటే ఆయా హీరో ల కొత్త సినిమాలకు సంబదించిన ఏదో ఒక అప్ డేట్ పుట్టిన రోజు విడుదల చేస్తారు. కానీ ఈ సారి మహేష్ బాబు పుట్టిన రోజున అంటే అగస్ట్ 9 న ఆయన ఫ్యాన్స్ కు ఎలాంటి కొత్త అప్ డేట్ రాలేదు. కొద్ది రోజుల నుంచి రాజమౌళి, మహేష్ బాబు ల కాంబినేషన్ లో తెరకెక్కనున్న కొత్త సినిమా వివరాలు వస్తాయని ఎక్కువ మంది ఆశించారు కానీ అదేమీ జరగలేదు. మహేష్ బాబు మాత్రం ఫ్యామిలీ తో కలిసి వెళ్లి పుట్టిన రోజు వేడుకులు జరుపుకుని వచ్చారు.

జైపూర్ ఎయిర్ పోర్ట్ లో మహేష్ బాబు న్యూ లుక్ తో కనిపించదు. పోనీటైయిల్ తో ..ఫుల్ గడ్డంతో కనిపించాడు. ఈ లుక్ రాజమౌళి సినిమా కోసమే అని చెపుతున్నారు. వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కనున్న సినిమా పై వచ్చే వార్తలతో ఇప్పటికే దీనిపై హైప్ ఒక రేంజ్ కు వెళ్ళింది అనే చెప్పాలి. ఈ సినిమా కథ అందిస్తున్న రాజమౌళి తండ్రి, రచయిత విజయేంద్ర ప్రసాద్ మాత్రం దేశ చిత్ర పరిశ్రమలో ఇప్పటివరకు చూడని ప్రపంచాన్ని రాజమౌళి ఆవిష్కరించబోతున్నారు అని వెల్లడించారు.

Next Story
Share it