Telugu Gateway
Cinema

బుర్జ్ ఖ‌లీఫాపై మ‌హేష్ బాబు ఫ్యామిలీ

బుర్జ్ ఖ‌లీఫాపై మ‌హేష్ బాబు ఫ్యామిలీ
X

హీరో మ‌హేష్ బాబు మోకాలి శ‌స్త్ర చికిత్స చేయించుకుని దుబాయ్ లో విశ్రాంతి తీసుకుంటున్న విష‌యం తెలిసిందే. ఇటీవ‌ల ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ తో త‌న త‌దుప‌రి సినిమా చ‌ర్చ‌లు కూడా దుబాయ్ లోనే చేశారు. మ‌హేష్ బాబు త‌న కుటుంబంతో క‌ల‌సి దుబాయ్ లోని బుర్జ్ ఖ‌లీపాపై నూత‌న సంవ‌త్స‌ర వేడుక‌లు చేసుకున్నారు. నూత‌న సంవ‌త్స‌రం సంద‌ర్బంగా ప్ర‌పంచంలోనే అత్యంత ఎత్తైన క‌ట్ట‌డం అయిన బుర్జ్ ఖ‌లీఫాపై భారీ ఎత్తున హ‌డావుడి ఉంటుంది.

బుర్జ్ ఖ‌లీఫాపై నుంచి దిగిన ఫోటోను మ‌హేష్ బాబు ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేశారు. అక్క‌డ నుంచి మిరుమెట్లుగొలిపే దుబాయ్ అందాల‌ను చూడొచ్చు. ప్ర‌స్తుతం స‌ర్కారు వారి పాట సినిమాలో న‌టిస్తున్న మ‌హేష్ బాబు ఇది పూర్తికాగానే...త్రివిక్ర‌మ్ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న సినిమాను మొద‌లుపెట్ట‌నున్నాడు.

Next Story
Share it